HomeజాతీయంBharat Bandh: ఇవాళ భారత్ బంద్.. కారణం ఏంటంటే?

Bharat Bandh: ఇవాళ భారత్ బంద్.. కారణం ఏంటంటే?

Nationwide Bharat Bandh: ఇవాళ భారత్ బంద్ జరగనుంది. ఈ సమ్మెకు 10 ప్రధాన కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. పలు రైతు సంస్థలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఈ పోరాటానికి పిలుపునిచ్చాయి.

ఎందుకు ఈ భారత్ బంద్?

ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాల స్థానే 2025 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లు వివాదాస్పదంగా మారాయి. ఇవి కార్మికులపై ప్రతికూల ప్రభావం చూపించనున్నాయని, ఇందువల్ల ఉద్యోగ భద్రత తగ్గిపోతుందని, ఉద్యోగులను తొలగించడం యజమానులకు తేలికవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రైవేటీకరణ, వేతనాల్లో వృద్ధి లేకపోవడం, సామాజిక భద్రత కొరవడటం జరుగుతుందని చెబుతున్నాయి. మరోవైపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రైతు సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఒప్పందం దేశీయ వ్యవసాయరంగాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నాయి.

వేటి మీద భారత్ బంద్ ప్రభావం ఉంటుందంటే?

భారత్ బంద్‌‌తో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, రవాణా, ప్రభుత్వ కార్యాలయాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో కార్మిక సంఘాలు పాల్గొనే అవకాశం ఉన్న కేరళ, ఒడిశాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. నిత్యావసరాలు, ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు, విద్యుత్, నీటి సరఫరా వంటివి యథాప్రకారం కొనసాగుతాయి. బ్యాంకులకు అధికారికంగా ఆర్బీఐ సెలవు ప్రకటించకపోవడంతో సేవల్లో అంతరాయ కలిగే అవకాశాలున్నాయి. నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌లో జాప్యం కలగవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు మామూలుగానే కొనసాగే వీలుంది. స్కూళ్లు, పాఠశాలలకు అధికారికంగా ఎలాంటి సెలవు ప్రకటించినప్పటికీ స్థానిక పరిస్థితులను బట్టి మూతపడే అవకాశాలుంటాయి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments