HomeజాతీయంYogi Adityanath: అయోధ్యలో బాబ్రీ పునర్నిర్మాణం.. సీఎం యోగీ సంచలన వ్యాఖ్యలు!

Yogi Adityanath: అయోధ్యలో బాబ్రీ పునర్నిర్మాణం.. సీఎం యోగీ సంచలన వ్యాఖ్యలు!

Yogi Adityanath On  Babri Masjid: అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. బారాబంకిలోని శ్రీరామ్ జానకి ఆలయంలో జరిగిన 10వ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం, శ్రీ రామార్చా పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రామ ద్రోహులకు అయోధ్యలో చోటు లేదు!

కొందరు అవకాశవాదులు ఉంటారని, వారికి కష్టాలు వచ్చినప్పుడే రాముడు గుర్తుకు వస్తాడని, ఇతర సమయాల్లో తలవను కూడా తలవరని యోగీ అన్నారు. అందువల్లే రాముడు కూడా వాళ్లను మరిచిపోతాడని చెప్పారు. “రాముని భక్తులపై బుల్లెట్లు కురిపించి, రాముడి సేవకు అవాంతరాలు కల్పించే రామద్రోహులకు ఇక్కడ చోటులేదు. బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తామని కలలు కంటున్న వారికి ఒకటే చెప్పదలచుకున్నారు. అలాంటి తీర్పుదినం ఎప్పటికీ రాదు”అని స్పష్టం చేశారు.

కలిసి బతికితే ఓకే.. లేదంటే..

“ఖయామత్ రోజు ఒకటి వస్తుందంటూ ఎదురుచూపులు చూస్తూ జీవితం గడిపేయవద్దు. హిందూస్థాన్‌లో కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఈ ధరిత్రి చట్టాలను గౌరవించాలి. మీరు చట్టాన్ని గౌరవించి, ఆ ప్రకారం నడుచుకుంటే లబ్ధి పొందుతారు. లేదంటే మార్గం చాలా స్పష్టంగా ఉంది. చట్టాన్ని ధిక్కరించి ముందుకు వెళ్లే వాళ్లు నరకానికే వెళ్తారు. చట్టాన్ని ధిక్కరించగలమని ఎవరైనా అనుకున్నా, స్వర్గానికి వెళ్తామని అనుకున్నా వారి కలలు ఎప్పటికీ కల్లలుగానే మిగిలిపోతాయి”అని యోగి తేల్చి చెప్పారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments