HomeతెలంగాణGraduation Day Celebrations: ఆలోచించే స్కిట్స్.. ఆహ్లాదపరిచే డ్యాన్సులు.. అట్టహాసంగా ‘మౌంట్ ఫోర్ట్’ గ్రాడ్యుయేషన్ వేడుకలు!

Graduation Day Celebrations: ఆలోచించే స్కిట్స్.. ఆహ్లాదపరిచే డ్యాన్సులు.. అట్టహాసంగా ‘మౌంట్ ఫోర్ట్’ గ్రాడ్యుయేషన్ వేడుకలు!

Graduation Day Celebrations AT Montfort School: ఒత్తిడిలేని చదువులు, బువ్వ పెట్టే అన్నదాతల కష్టాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఫోక్సో యాక్ట్ అవగాహన, సాంప్రదాయ నృత్యాలు, ఉత్సాహపరిచే డ్యాన్సులు, ఒకటేమిటీ.. నల్లగొండ మౌంట్ ఫోర్ట్ సీబీఎస్ఈ స్కూల్ లో జరిగిన ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలో విద్యార్థుల కల్చరల్ ఈవెంట్స్  చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. చిట్టిపొట్టి చిన్నారులు చక్కటి గెటప్స్ లోఅదిరిపోయే పర్ఫార్మెన్స్ తో అలరించారు. సుమారు 2 గంటల పాటు కొనసాగిన ఈ వేడుకలు అందరినీ ఆహా అనిపించాయి.

ఒక్కో క్లాస్ విద్యార్థులు ఒక్కో థీమ్ తో..

ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా LPP నుంచి థర్డ్ క్లాస్ వరకు విద్యార్థులు రకరకాల ప్రదర్శనలు చేశారు. చిన్నారుల క్లాసికల్ డ్యాన్సుతో మొదలైన ఈ కార్యక్రమం.. రకరకాల అంశాలను సృశించింది.  ఒక్కో క్లాస్ విద్యార్థులు ఒక్కో థీమ్ డ్యాన్సు, స్కిట్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఒత్తిడి లేని చదవుల గురించి చెప్పడంతో పాటు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తూ ఫోక్సో చట్టం గురించి చక్కగా అవగాహన కలిగించారు. అన్నదాతలు పడే కష్టాల గురించి చక్కటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు, మోడ్రన్ అయ్యగారు లాంటి కామెడీ స్కిట్స్ చేశారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వేడుకలను చూసి సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు

గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా LPP నుంచి 3వ తరగతి వరకు చదువులలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఒక్కో సెక్షన్ నుంచి ముగ్గురు విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ఇచ్చారు. అటు LPP, UPP విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ధరించిన గ్రాడ్యుయేషన్ డ్రెస్సులు అందరినీ ఆకట్టుకున్నాయి.

 

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు

గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలు అయిన వారికి బహుమతులు అందించారు. ఫస్ట్, సెకెండ్, థర్డ్ ప్రైజులు ఇచ్చారు.

చీఫ్ గెస్టుగా హాజరైన CID ఇన్ స్పెక్టర్ ప్రశాంత్

ఈ గ్రాడ్యుయేషన్ వేడుకలకు ముఖ్య అతిథిగా CID ఇన్ స్పెక్టర్ డి. ప్రశాంత్ హాజరయ్యారు. విద్యార్థులు చక్కగా చదువుకోవడంతో పాటు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. విద్యార్థుల తలరాతను మార్చేది చదువు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆటా పాటలతో పాటు టీచర్లను, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలన్నారు. ఇప్పుడు కష్టపడి చదివితేనే, భవిష్యత్ లో మంచి పౌరులుగా ఎదురుతారని చెప్పారు ఇన్ స్పెక్టర్ ప్రశాంత్ .

ఈ వేడుకల్లో మౌంట్ ఫోర్ట్ సీబీఎస్ స్కూల్ కరస్పాండెంట్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ బ్రదర్ బాల ఇన్నయ్య, స్కూల్ టీచర్లతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments