Homeతెలంగాణగత రెండేళ్లుగా కేసీఆర్ ను తిట్టడమే మీ పని : కేటీఆర్

గత రెండేళ్లుగా కేసీఆర్ ను తిట్టడమే మీ పని : కేటీఆర్

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు సభలో పాల్గొన్న కేటీఆర్ .. సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ను తిట్టడమే తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని ఫైర్ అయ్యారు. ప్రతిరోజు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలను దోచుకోవడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తెలంగాణ రాజకీయ చరిత్రలో బూతులు మాట్లాడే ఏకైక ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి మిగిలిపోతారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత దరిద్రపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని.. తండూరు సభలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌… ఇవాళ్టి నుంచి వైన్స్‌లు బంద్‌

అంత పిచ్చెందుకు మరీ!.. మహిళ ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments