Homeతెలంగాణశాంతిభద్రతల పరిరక్షణకే ఫ్లాగ్‌ మార్చ్‌

శాంతిభద్రతల పరిరక్షణకే ఫ్లాగ్‌ మార్చ్‌

•ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

•హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు

క్రైమ్ మిర్రర్,నేరేడుచర్ల:- ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదన్నారు. అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపు, పంపిణీ వంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు తెలుపాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాగేలా అందరూ సహకరించాలని కోరారు.ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా శాంతి భద్రతలకూ విఘాతం కలిగించకుండా ఉండేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్, పాలకీడు ఎస్ఐ కోటేష్, గరిడేపల్లి ఎస్ఐ నరేశ్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Read also : Supreme Court: ఇష్టం లేకుండా గర్భం ఉంచుకోమని చెప్పలేం, సుప్రీం కీలక వ్యాఖ్యలు!

Read also : Ride Services: క్యాబ్స్ లో వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఇవాళ ఆ సర్వీసులు ఉండవట!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు