HomeజాతీయంSupreme Court: ఇష్టం లేకుండా గర్భం ఉంచుకోమని చెప్పలేం, సుప్రీం కీలక వ్యాఖ్యలు!

Supreme Court: ఇష్టం లేకుండా గర్భం ఉంచుకోమని చెప్పలేం, సుప్రీం కీలక వ్యాఖ్యలు!

Supreme Court On Reproductive Autonomy: సంతానోత్పత్తికి సంబంధించి మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఏ మహిళను ఒత్తిడి చేయలేమని స్పష్టం చేసింది. మైనర్‌గా ఉన్నప్పుడు గర్భవతైన ఓ యువతి 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అబార్షన్ కు అనుమతిని నిరాకరిస్తూ ముంబై హైకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ బీవీ నాగర్నత సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.

బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్ కారణంగా..

మహారాష్ట్రకు చెందిన బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్ కారణంగా కొన్ని నెలల క్రితం గర్భవతైంది. అప్పటికి ఆమెకు 17 ఏళ్లు. ప్రస్తుతం 18 ఏళ్ల నాలుగు నెలలు. 30 వారాల గర్భిణి. అయితే గర్భాన్ని కొనసాగించాలని తాను కోరుకోవడం లేదంటూ ముంబై హైకోర్టును ఆమె ఆశ్రయించింది. అయితే ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గడువు మించిపోయిందంటూ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో ఆ బాలిక సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాలిక తరఫు న్యాయవాది కోర్టులో తన వాదన వినిపిస్తూ, ప్రెగ్నెన్సీని కొనసాగించాలని ఒత్తిడి చేస్తే సామాజిక కళంకం తలెత్తే అవకాశం ఉండవచ్చనే కారణంగా ఆమె మానసిక ఆందోళనకు గురికావచ్చన్నారు.

అబార్షన్ కు సుప్రీంకోర్టు అనుమతి

ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. గర్భవిచ్ఛితికి నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైనప్పటికీ అప్పీలుదారు హక్కును తప్పనిసరిగా పరిరక్షించాల్సి అంటుందని పేర్కొంది. ఆమె ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలనడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. గర్భవిచ్ఛితికి అనుమతించినా అమ్మాయికి ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది. యువతి నుంచి లిఖితపూర్వక అండర్‌టేకింగ్‌ తీసుకోవాలని, గర్భవిచ్ఛితికి వైద్యులను అనుమతిస్తున్నామని తీర్పు వెలువరించింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు