Monday, March 23, 2026
Homeతెలంగాణకాలనీ అభివృద్ధి కై కదలిరండి.. ఆదరణ పొందుతున్న బీజేపీ అభ్యర్థి రాధారెడ్డి

కాలనీ అభివృద్ధి కై కదలిరండి.. ఆదరణ పొందుతున్న బీజేపీ అభ్యర్థి రాధారెడ్డి

నాగర్ కర్నూల్,క్రైమ్ మిర్రర్:- అభివృద్ధికై కాలనీవాసులు కలిసి రావాలని బిజెపి అభ్యర్థి దొడ్ల రాధ రాజవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో బీజేపీ అభ్యర్థి దొడ్ల రాజా వర్ధన్ రెడ్డి, బీజేపీ శ్రేణులతో కలిసి సోమవారం జోరుగా ప్రచారం నిర్వహించారు. తమకు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా ఒకమారు అవకాశం కల్పించి ఆశీర్వదించాలని కాలనీ ప్రజలకు ప్రచారంలో భాగంగా కోరారు. ఈ సందర్భంగా ప్రచారంలో కాలనీ కార్యకర్తలు వాసులతో తమ ఆలోచనను పంచుకున్నారు. కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు. అదేవిధంగా కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీవాసులకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ ఫలాలు అర్హులైన పేద ప్రజలకు అందజేస్తామన్నారు. అన్ని రంగాల్లో కాలనీ అభివృద్ధి చెందాలంటే అది బిజెపి డబల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమైతుందని తెలియజేశారు.ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీశైలం, సుధాకర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు తదితరులు ఉన్నారు.

Read also : Trump Praises India Gate: ఇండియా గేట్‌ బాగుంటుంది..అమెరికాలో కట్టేస్తాం: ట్రంప్

Read also : India–US Trade Deal: భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు, సుంకాలు తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments