Homeతెలంగాణహైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల నిరసన..!

హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల నిరసన..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: సిటీ ఆటో బంద్‌కు “ఐఎల్డబ్ల్యుఎఫ్” (ILWF) మరియు మహాత్మా గాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచిన సందర్బంగా తెలంగాణ రాష్ట్రము  హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నేడు (జనవరి 20, 2026) ఆటో డ్రైవర్లు ఒక రోజు సమ్మె మరియు నిరసనను చేపట్టారు.

 

ఈ సందర్బంగా వారు ప్రభుత్వం ముందు ప్రధానంగా కొన్ని అంశాలు డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను సవరించాలని, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి సంస్థలు నడుపుతున్న బైక్ టాక్సీలను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర జిల్లాల నుండి వచ్చే ఆటోలు నగర పరిమితుల్లో తిరగకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ₹12,000 వార్షిక ఆర్థిక సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు.

 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం పడిపోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు వాపోతున్నారు. ఇంకా వారు మాట్లాడుతూ… తెలంగాణలో పూర్తిస్థాయిలో మద్యం నిషేధించాలని కూడా కొందరు డ్రైవర్లు ఈ బంద్‌లో డిమాండ్ చేస్తున్నారు. అయితే, స్టేట్ టాక్సీ అండ్ ఆటో యూనియన్ వంటి కొన్ని సంఘాలు ఈ బంద్‌ను తాము నిర్వహించడం లేదని, త్వరలోనే భారీ స్థాయిలో నిరసన చేపడతామని స్పష్టం చేశాయి.

 

ప్రస్తుతం నగరంలో మరోవైపు సిఎన్‌జి (CNG) కొరత కూడా ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని దెబ్బతీస్తోంది అని ఆవేదనను వ్యక్తంచేశారు.ఈ సమ్మె వల్ల పాఠశాల విద్యార్థులు మరియు కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు