Homeతెలంగాణఅంగరంగ వైభవంగా 'పంబరట్టు మహోత్సవం'

అంగరంగ వైభవంగా ‘పంబరట్టు మహోత్సవం’

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయశంకర్ జిల్లా, మహాదేవపూర్ మండలంలోని సూరారం గ్రామం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. అయ్యప్ప మాలధారణ భక్తులతో శుక్రవారం సందడిగా మారింది. అయ్యప్ప పంబారట్టు (జలక్రీడ..) సమీపంలోని గోదావరిలో కన్నులపండువగా జరిగింది. జల క్రీడలో భాగంగా అయ్యప్ప స్వామికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బస్వం, పంచదార, గంధం, పసుపుతో అభిషేకం చేశారు. జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలో శుక్రవారం అయ్యప్ప పంబారట్టు ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. కేరళ రాష్ట్రంలోని శబరిమలై సన్నిధానం సమీపంలోని పంబానదిలో ఏ విధంగా జరుగుతుందో అదే రీతిలో ఉత్సవాలు జరిపారు.

Read also : శంకర్ పల్లి ఆదర్శ పాఠశాలలో కరాటే ప్రోగ్రాం

Read also : న్యూ ఇయర్ ఎఫెక్ట్: కిలో మల్లెలు రూ.3,000.. ఎక్కడో తెలుసా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments