Monday, March 2, 2026
HomeజాతీయంParliament Winter Session: పార్లమెంటు ముందుకు 10 కీలక బిల్లులు, ‘సర్’పై విపక్షాల సమరం!

Parliament Winter Session: పార్లమెంటు ముందుకు 10 కీలక బిల్లులు, ‘సర్’పై విపక్షాల సమరం!

Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 19 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్రం కోరనుంది.

సభ ముందుకు 10 కీలక బిల్లుల

రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన ‘ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025’తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు (ఎస్ఎంసి)-2025, జాతీయ రహదారుల (సవరణ) బిల్లు, అర్బిట్రేషన్, కాన్సిలియేషన్ (సవరణ) బిల్లు, ఇన్సూరెన్స్ చట్ట (సవరణ) బిల్లు, ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ (సవరణ) బిల్లు, కార్పొరేట్ చట్ట (సవరణ) బిల్లు, ది హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు-2025, ది మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (సవరణ) బిల్లు-2025, జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2025ని సభ ముందుకు తీసుకురానున్నాయి.  ఉండనున్నాయి.

సమరానికి సిద్ధం అవుతున్న విపక్షాలు

ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు అంశాలను లేవనెత్తేందుకు విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రధానంగా ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ జాబితా, అదానీ అంశం, ఢిల్లీ పొల్యూషన్ వంటి అంశాలను లేవనెత్తే అవకాశాలున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్‌) అంశం కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటులో చర్చకు తీసుకురావాల్సిన అంశాలపై చర్చించుకునేందుకు ఇండి కూటమి పార్టీల ప్రతినిధులు సోమవారం ఖర్గే కార్యాలయంలో భేటీ కానున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments