Homeతెలంగాణ81 మందితో మోడీ టీం...!

81 మందితో మోడీ టీం…!

  • దసరాకు ముందే కేంద్ర క్యాబినెట్ విస్తరణ

  • తెలుగు రాష్ట్రాల్లో కొత్త వారికి ఛాన్స్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ తన క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తారా? దీపావళికి ముందే శ్రీకారం చుడతారా? మిత్రపక్షాలకు పెద్దపీట వేస్తారా? వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా జనతా కాక్రోచ్ ఉద్యమాలు, నియోజకవర్గాల పునర్విభజన అంశం వంటివి పరిగణలోకి తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతారన్న ప్రచారం నడుస్తోంది. జంబో క్యాబినెట్ ను ప్రకటిస్తారని టాక్ ఉంది. ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో కూడా ఇదే ప్రచారం నడుస్తోంది.

  • గత కొంతకాలంగా చర్చ..

గత కొంతకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై అనేక రకాల చర్చ నడుస్తూనే వస్తోంది. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదిగో విస్తరణ.. ఇదిగో విస్తరణ అంటూ చాలా రకాలుగా టాక్ నడిచింది.

కానీ రకరకాల కారణాలతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వాయిదా పడింది. తాజాగా తమిళనాడుకు చెందిన మురుగన్ రాజీనామాతో మరోసారి ప్రచారం మొదలైంది. దీపావళి కంటే ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారన్న టాక్ ప్రారంభం అయింది. అక్టోబర్ 20 తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇప్పుడు కొత్త చర్చ నడుస్తోంది. దీంతో ఆశావహులలో సందడి మొదలైంది.

  • అదనంగా 11 మంత్రి పదవులు..

ప్రస్తుతం మంత్రివర్గంలో 70 మంది మాత్రమే ఉన్నారు. కానీ లోక్సభ సభ్యుల్లో 15% వరకు మంత్రులను ఎంపిక చేసుకోవచ్చు. ఈ లెక్కన మరో పదకొండు మందికి కొత్తగా ఛాన్స్ ఇవ్వచ్చు.. అయితే ఇప్పుడు ఉన్న పార్టీలకు అదనంగా కొన్ని పార్టీలు ఎన్డీఏలో చేరాయి.

వాటికి సైతం మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించాలి. వివిధ ప్రాంతీయ పార్టీలతో విభేదించిన ఎంపీలు శిబిరాలుగా ఏర్పడి ఎన్డీఏలో చేరారు. బెంగాల్లో మమతా బెనర్జీని వ్యతిరేకించిన ఎంపీలంతా ఎన్డీఏ గూటికి వచ్చారు. వారిలో కొందరికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. అందుకే మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ భారీగా చేపడుతారన్న టాక్ నడుస్తోంది.

  • తెలుగు రాష్ట్రాలకు పెరగనున్న ప్రాతినిధ్యం..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో ఐదుగురు ఉన్నారు. వాటిలో తెలంగాణలో ఇద్దరు బిజెపి ఎంపీలకు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి తో పాటు బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఈసారి మరో మూడు మంత్రి పదవులు అదనంగా ఇస్తారని తెలుస్తోంది.

ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, నగేష్ వంటి వారు పదవులు ఆశిస్తున్నారు. అలాగే ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు.

తెలుగుదేశం పార్టీతో మరింత మైత్రి పెంచుకునేందుకు మరో కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే జనసేనకు ఇప్పటివరకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆ పార్టీకి చెందిన మచిలీపట్నం ఎంపీకి ఈసారి అవకాశం ఇస్తారని కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు