Homeఆంధ్ర ప్రదేశ్అమరావతికి గుడ్ న్యూస్...!

అమరావతికి గుడ్ న్యూస్…!

  • మరో రూ.15 వేల కోట్ల అదనపు సాయం

  • ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని కి మరో గుడ్ న్యూస్. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అదనంగా 15 వేల కోట్ల రూపాయలు అందించేందుకు సానుకూలత వ్యక్తం చేశాయి. ఇటీవల ఆ రెండు బ్యాంకుల ప్రపంచ ప్రతినిధులు అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుండడం పై సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సిఆర్డిఏ అధికారులు మరో 15 వేల కోట్ల అదనపు రుణం గురించి ప్రస్తావించారు. దీనిపై సానుకూలంగా వారు స్పందించడంతో.. అదనపు నిధులు విడుదలవుతాయన్న ఆశాభావం వ్యక్తం అవుతుంది.

  • శరవేగంగా పనులు..

ప్రస్తుతం అమరావతిలో 52 వేల కోట్ల రూపాయలతో 102 ప్రాధాన్యత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కీలక నిర్మాణ పనులు ఊపొందుకుంటున్నాయి. 2028 నాటికి తొలిదశ అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరువ అవుతోంది ఏపీ ప్రభుత్వం.

వేలాదిమంది కార్మికులు, ఇంజనీరింగ్ నిపుణులతో పనులు జరుగుతున్నాయి. భారీ యంత్రాలతో పాటు పరికరాలతో పనులు చేపడుతున్నారు. రేయింబవళ్లు పనులు జరుగుతుండగా.. ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. మంత్రి నారాయణ అమరావతి రాజధాని నిర్మాణ పనుల బాధ్యతలను చూస్తున్నారు.

  • కేంద్రం సర్దుబాటు..

అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయల సాయం అందించిన సంగతి తెలిసింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వార్షిక బడ్జెట్లో ఈ నిధులను సర్దుబాటు చేసింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా ఈ నిధులను సమకూర్చింది.

అయితే అప్పట్లో అమరావతిపై విష ప్రచారం చేసి ఈ సాయాన్ని అడ్డుకోవాలని చూశారు. కానీ స్వయంగా పరిశీలించిన ఆ రెండు బ్యాంకుల ప్రతినిధులు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పనులు జరుగుతుండడంతో.. మరో 15 వేల కోట్ల అదనపు నిధుల మంజూరుకు సైతం సుముఖత వ్యక్తం చేశారు. అదే జరిగితే అమరావతిలో మిగిలిన ప్రధాన నిర్మాణాలు సైతం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిజంగా అమరావతికి ఇది శుభవార్త.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు