Wednesday, March 4, 2026
Homeజాతీయంసెప్టెంబర్ లో సగం రోజులు బ్యాంకులు బంద్, కారణం ఏంటంటే?

సెప్టెంబర్ లో సగం రోజులు బ్యాంకులు బంద్, కారణం ఏంటంటే?

Bank Holidays: సెప్టెంబర్ లో బ్యాంకులు సగరం రోజులు మూతపడనున్నాయి. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించింది.  సెప్టెంబర్ లో పండుగలు, వీకెండ్స్ తో కలిపి సగం రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే, ఆర్‌బీఐ సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడేస్ మాత్రం కామన్ గా ఉంటాయి.

సెప్టెంబర్‌ నెలలో బ్యాంకు సెలవుల జాబితా..

సెప్టెంబర్‌ 3 (బుధవారం): కర్మ పూజ- జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ లో సెలవు.

సెప్టెంబర్‌ 4 (గురువారం): కేరళలో ఓనం మొదటి రోజు సందర్భంగా సెలవు.

సెప్టెంబర్ 5 (శుక్రవారం): మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అహ్మదాబాద్‌, ఐజ్వాల్‌, బేలాపూర్‌, బెంగళూరు, భోపాల్‌, చెన్నై, డెహ్రాడూన్‌, హైదరాబాద్‌, ఇంఫాల్‌, కాన్పూర్‌, లక్నో, ముంబై, నాగ్‌పూర్‌, న్యూ ఢిల్లీ, రాంచీ, శ్రీనగర్‌, తిరువనంతపురం, విజయవాడలో బ్యాంకులకు సెలవు.

సెప్టెంబర్ 6 (శనివారం): ఇంద్రజాత్ర సందర్భంగా సిక్కిం, జమ్ము, రాయ్‌పూర్‌, శ్రీనగర్‌లో బ్యాంకులు పనిచేయవు.

సెప్టెంబర్‌ 7 : ఆదివారం

సెప్టెంబర్‌ 12 (శుక్రవారం): ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

సెప్టెంబర్‌ 13 : రెండో శనివారం

సెప్టెంబర్‌ 14 : ఆదివారం

సెప్టెంబర్‌ 21 : ఆదివారం

సెప్టెంబర్‌ 22 (సోమవారం): నవరాత్రి స్థాపన సందర్భంగా రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు.

సెప్టెంబర్‌ 23 (మంగళవారం): మహారాజా హరి సింగ్ జీ జన్మదిన సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు.

సెప్టెంబర్‌ 27 : నాలుగో శనివారం

సెప్టెంబర్‌ 28 : ఆదివారం

సెప్టెంబర్‌ 29 (సోమవారం): దుర్గాపూజ సందర్భంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

సెప్టెంబర్‌ 30 (మంగళవారం): మహా అష్టమి, దుర్గాష్టమి సందర్భంగా త్రిపుర, ఒడిశా, అస్సాం, మణిపూర్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments