Tuesday, March 10, 2026
Homeజాతీయంఅమెరికాపైనా 50 శాతం టారిఫ్ విధించాలి, ప్రభుత్వానికి శశిథరూర్ సూచన!

అమెరికాపైనా 50 శాతం టారిఫ్ విధించాలి, ప్రభుత్వానికి శశిథరూర్ సూచన!

Shashi Tharoor: భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఎగుమతులపై 50 శాతం దిగుమతి సుంకాలు విధించడం అన్యాయం అన్నారు. చైనా భారత్ కంటే ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నా, వాళ్లకు మినహాయింపు ఇచ్చారని విమర్శించారు. భారత్ పై చైనా కంటే అధిక సుంకాలు విధిస్తూ అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా పైనా 50 శాతం సుంకాలు విధించాలి!

భారత ప్రభుత్వం కూడా అమెరికా దిగుమతులపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. “మన దేశం దాదాపు 90 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అలాంటి సమయంలో అధిక దిగుమతి సుంకాలు విధిస్తే, మన ఉత్పత్తులను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. ఎందుకు కొనుగోలు చేయాలని ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది కచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చైనా రష్యా నుంచి భారత్ కన్నా ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. అమెరికా ఆ దేశానికి 90 రోజుల పాటు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. కేంద్రం కూడా అమెరికా దిగుమతులపై 50 శాతం సుంకం విధించడంపై ఆలోచించాలి. ఇతర దేశాల బెదిరింపులకు లోనవకుండా భారత్‌ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది” ఇదేనని అన్నారు.

Read Also: రైతుల ప్రయోజనాలే ముఖ్యం, ట్రంప్ టారిఫ్ లపై మోడీ కౌంటర్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments