Saturday, March 28, 2026
Homeక్రైమ్సోషల్ మీడియా పరిచయం... మహిళా దారుణ హత్య? ఎక్కడంటే!

సోషల్ మీడియా పరిచయం… మహిళా దారుణ హత్య? ఎక్కడంటే!

క్రైమ్ మిర్రర్, కర్ణాటక :- ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ అయినటువంటి ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ అలాగే ఇతర యాప్ ల ను విపరీతంగా ఉపయోగించడంతో నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఫేస్బుక్ పరిచయం.. ఒక అక్రమ సంబంధం గా మారి చివరకు ప్రాణాలను బలి తీసుకోవడం జరిగింది. కర్ణాటక కు చెందిన ఒక మహిళను ఫేస్బుక్లో పరిచయమైన మగ వ్యక్తి హత్య చేయడం జరిగింది. ఇక అసలు వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కర్ణాటక కు చెందిన పునీత్ అనే వ్యక్తి 28 ఏళ్ల ప్రీతి అనే వివాహిత తో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ మహిళకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పునీత్ అలాగే ప్రీతి ఇద్దరు కూడా ఆన్లైన్లో మాట్లాడుకోవడంతోపాటు ఫోన్ కాల్స్ చేసుకొని నిత్యం ఆనందంగా గడిపేవారు. ఈ మధ్యలో ఒకరోజు ఆదివారంనాడు ఇద్దరు మొట్టమొదటిసారిగా వ్యక్తిగతంగా కలుసుకోవడం జరిగింది. ఆ తరువాత ఒక కారును రెంటుకు తీసుకొని ఎన్నో ప్రదేశాలు తిరిగి చివరికి కృష్ణరాజ సాగర సమీపంలోని ఒక లాడ్జిలో దిగారు. చివరికి ఇద్దరు లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నాడు. అయితే ఆ తరువాత ప్రీతి తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని పునీత్ పై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చింది. ఇక ఆమె పదేపదే శృంగార సంబంధం కొనసాగించాలని పట్టుబడి వాదనకు దిగడంతో పునీత్ వెంటనే దగ్గరలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇక ఆ అటవీ ప్రాంతంలోని వీరిద్దరి మధ్య దగ్గర వాగ్వాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఇక వెంటనే కోపానికి గురైన పునీత్ ఒక పెద్ద బండ రాయిని తీసుకొని ప్రీతి తలపై బలంగా కొట్టి చంపడం జరిగిందని పోలీసులు విచారణలో తేలింది. ఆ తరువాత ఆ మృతదేహాన్ని పునీత్ తన సొంత గ్రామం కరోతి గ్రామం కు తరలించి తను సాగు చేసే వ్యవసాయ భూమిలోనే పాతిపెట్టాడు. ఇక ప్రతి భర్త తన భార్య కనిపించడం లేదంటూ మాండ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఆమె నెంబర్ కు కాల్ చేయగా పునీత్ సమాధానం ఇచ్చాడని తేలిపోయింది. ఆ తర్వాత పూర్తి విచారణ చేసిన తర్వాత పునీత్ ఏ ప్రీతిని చంపాడు అని పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే నిందితుడు పునీత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక బైకులకూ టోల్ ఛార్జీ.. నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే?

ఐఎస్ఎస్ లోకి శుభాన్షు, తొలి భారతీయుడిగా రికార్డు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments