Saturday, March 28, 2026
Homeక్రీడలుఫస్ట్ టెస్టులో ఓటమి.. గంభీర్ ఏమన్నాడంటే?

ఫస్ట్ టెస్టులో ఓటమి.. గంభీర్ ఏమన్నాడంటే?

IND vs ENG Test: ఇంగ్లాండ్ పై తొలి టెస్టులో ఓడిపోవడంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమికి ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదన్నారు. జట్టుగానే ఆడాం, జట్టుగానే ఓడాం, జట్టుగానే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడ. ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంకాస్త ఎక్కువ పరుగులు చేసి ఉంటే, ఫలితం మరోలా ఉండేదన్నాడు.

ఓటమి సమిష్టి బాధ్యత!

ఫస్ట్ టెస్ట్ ఓటమి అందరి సమిష్టి బాధ్యత అని గంభీర్ వెల్లడించాడు. “ఈ ఓటమికి ఏ ఒక్కరినీ బాధ్యులను చేయాల్సిన అవసరం లేదు. ఎవరినీ నిందించాల్సిన పని లేదు. కొన్నిసార్లు ప్లేయర్స్ ఫెయిల్ అవుతుంటారు. క్రికెట్ లో ఇది కామన్. ఈ ఓటమి అందరినీ నిరుత్సాహ పరుస్తుంది అనేది నిజం. ఆటగాళ్లు ఇంకా బాధలో ఉంటారు. తొలి ఇన్నింగ్స్ లో 580 పరుగులు చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. బ్యాటింగ్ లో టెయిలెండర్స్ కూడా కాస్త రాణిస్తే ఇంకా బాగుండేది. ఒక్కరి వల్ల మ్యాచ్ ఓడిపోలేదు. జట్టుగానే ఓడాం. జట్టుగానే నెక్ట్స్ టెస్ట్ గెలుస్తాం” అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

 శార్దూల్ అలా.. శుభ్ మన్ ఇలా!

అటు శార్దూల్ బౌలింగ్ గురించి కూడా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శార్దూల్ ను తాము జట్టులోకి స్పెషల్ బౌలర్ గా తీసుకోలేదన్నాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ గా టీమ్ లో స్థానం కల్పించినట్లు చెప్పాడు. అయినప్పటికీ, రెండు కీలకమైన వికెట్లు తీసుకున్నాడని చెప్పాడు. జడేజా అద్భుంగా  బౌలింగ్ చేయడంతో శార్దూల్ కు ఎక్కువగా బౌలింగ్ చేసుకునే అవకాశం రాలేదన్నాడు. అటు కెప్టెన్ శుభ్ మన్ గిల్ గురించి కూడా గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గిల్ తొలి ఇన్నింగ్స్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేసినట్లు చెప్పాడు. కెప్టెన్ గా ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేయడం అద్భుతమన్నాడు. సక్సెస్ ఫుల్ కెప్టెన్ లో ఉండాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నట్లు గంభీర్ వెల్లడించాడు. అతడికి మరికాస్త సమయం ఇస్తే బాగా షైన్ అవుతాడని వెల్లడించాడు. మొదటి టెస్ట్ లో తప్పులను రెండో టెస్టులో జరగకుండా చూసుకోనున్నట్లు గంభీర్ వివరించాడు.

Read Also: ఇకపై 4 రోజులే టెస్ట్ మ్యాచ్.. ఐసీసీ కీలక నిర్ణయం!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments