Friday, March 20, 2026
Homeజాతీయంషార్ కు బాంబు బెదిరింపు.. నిఘా నీడలో శ్రీహరికోట!

షార్ కు బాంబు బెదిరింపు.. నిఘా నీడలో శ్రీహరికోట!

Sriharikota:  ఏపీలోని శ్రీహరికోట భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)కు బాంబు బెదిరింపు వచ్చింది. షార్‌ లో తీవ్రవాదులు ఉన్నారంటూ తమిళనాడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు  రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది శ్రీహరికోటలో నిఘా పెంచారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

అర్థరాత్రి వేళ బెదిరింపు కాల్

అర్థరాత్రి వేళ కాల్ రావడంతో.. తెల్లవారుజాము నుంచి నుంచి షార్‌ పరిసరాల్లో అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.  సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు పోలీసులు షార్ లోని అణువణువును జల్లెడపట్టాయి.  సముద్ర మార్గాల్లోనూ తీరప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేపట్టాయి. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

ఇండో- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో..

రీసెంట్ గా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఇప్పటికే దేశంలోని సున్నిత ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలతో పాటు పోర్టులు, విమానాశ్రయలపై దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల భద్రత పెంచారు. అటు ఈ ఫోన్ కాల్ పై విచారణ జరిపిన నిఘా అధికారులు అది ఆకతాయిలు చేసిన కాల్ గా గుర్తించారు. అయినప్పికీఏ షార్ దగ్గర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. షార్ లో ఏమైనా అనుమానిత వస్తువులు ఉన్నాయేమోనని ఆరా తీస్తున్నారు.

Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భగ్గుమంటున్న పశ్చిమాసియా!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments