Tuesday, March 17, 2026
Homeజాతీయంఅవును.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి నా భర్తను చంపా- సోనమ్

అవును.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి నా భర్తను చంపా- సోనమ్

Meghalaya Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులు రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు కిరాయి హంతకులతో తన భర్త రాజా రఘువంశీని సోనమ్ హత్య చేయించింది అనుకున్నారు. కానీ, పోలీసు విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. తానే స్వయంగా భర్తను హత్య చేసినట్లు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడైన సోనమ్‌ బాయ్ ఫ్రెండ్ రాజ్‌ కుష్వాహా సమక్షంలో ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన భర్త హత్యకు పన్నిన కుట్రతో పాటు హత్యలో భాగస్వామ్యం ఉన్నట్లు అంగీకరించింది. మర్డర్ తర్వాత రాజ్‌ కుష్వాహాతో కలిసి సోనమ్‌ తీసుకున్న ఫొటో కూడా వెలుగులోకి వచ్చింది.

హత్య తర్వాత ఇండోర్ కు వచ్చిన సోనమ్, రాజ్

రాజా వంశీని మే 23న హత్య చేసి మృదేహాన్ని లోయలో పడేసిన తర్వాత మే 25న సోనమ్, రాజ్ ఇండోర్‌కు తిరిగి వచ్చారని పోలీసులు వెల్లడించారు. రెంట్ కు తీసుకున్న రూమ్ లో ఆమె.. ప్రియుడు  రాజ్‌ కుష్వాహాను కలుసుకుందని తెలిపారు. మే 23న మేఘాలయలోని వీ సాడాంగ్‌ జలపాతం దగ్గర రఘువంశీ అదృశ్యం అయ్యాడు. జూన్‌ 2న ఆయన మృతదేహం వాటర్‌ ఫాల్స్‌ సమీపంలోని లోయలో దొరికింది. రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించి సోనమ్‌ తో పాటు, మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి  షిల్లాంగ్‌ కోర్టు 8 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

సోనమ్ ను ఉరి తీయాల్సిందే!

రాజా రఘువంశీ హత్యకు కారణం తన సోదరి సోనమ్ అని నమ్ముతున్నట్లు ఆమె సోదరుడు గోవింద్ అన్నాడు. తన సోదరితో తమ కుటుంబం అన్ని బంధాలను తెంపుకుందన్నాడు. హత్యకు గురైన రాజా ఇంటికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చాడు.  కొడుకును కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న రాజా తల్లి ఉమను సముదాయించాడు. న్యాయం కోసం రాజా కుటుంబ చేసే పోరాటానికి తాను సపోర్టుగా ఉంటానని చెప్పాడు. ఆమె నేరం రుజువైతే నేరుగా ఉరి తీయాల్సిందేనన్నాడు. కోర్టులో రాజా రఘువంశీ కుటుంబం తరఫున వాదించేందుకు తానే ఓ అడ్వకేట్ ను ఏర్పాటు చేయిస్తానన్నాడు. అకారణంగా రాజాను కోల్పోయిన కుటుంబానికి గోవింద్ క్షమాపణలు చెప్పాడు.

Read Also: ఆధారాలు లేని అభియోగాలు వద్దు, మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments