Tuesday, March 17, 2026
Homeతెలంగాణకొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ఎవరికి ఏం దక్కిందంటే?

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ఎవరికి ఏం దక్కిందంటే?

Telangana New Cabinet:  తాజాగా తెలంగాణ కేబినెట్ లోకి అడుగు పెట్టిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలను అలాట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అధిష్టానంతో సంప్రదింపుల అనంతరం నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఫోర్ట్ పోలియోలను కేటాయించారు. ఇంతకీ ఏ మంత్రికి ఏశాఖను కేటాయించారంటే..

కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే!

1.గడ్డం వివేక్ వెంకటస్వామి: కార్మిక, మైనింగ్ శాఖలు

2.వాకిటి శ్రీహరి: పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలు

3.అడ్లూరు లక్ష్మణ్‌: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలు

తాజా మంత్రుల శాఖల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల జారీకి ముందు సీఎం రేవంత్ రెడ్డితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు భేటీ అయి చర్చించారు.

జూన్ 8న మంత్రివర్గ విస్తరణ

జూన్ 8న సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్‌‌ను విస్తరించారు. కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ (చెన్నూరు), వాకిటి శ్రీహరి (మక్తల్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి)ను కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అదే రోజు మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ వారి చేత ప్రమాణ స్వీకరం చేయించారు. వెంటనే వారికి శాఖలను కేటాయించలేదు. ఢిల్లీకి వెళ్లి అధిష్టాతనంతో మాట్లాడిన రేవంత్, శాఖల కేటాయింపుపై చర్చలు జరిపారు. హైకమాండ్ సూచనల మేరకు ఆయన కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. పాత మంత్రుల శాఖల్లో మార్పులు లేకుండా, తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో మంత్రుల సంఖ్య 15గా ఉంది.

Read Also: మా నాన్నని అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ నేతల తరం కాదు : కేటీఆర్

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments