Homeతెలంగాణప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి:- గోల్కొండ కిరణ్

ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి:- గోల్కొండ కిరణ్

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:- గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పై దుష్ప్రచారాలు చేస్తున్న నాయకులు బ్యారేజ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు మార్గదర్శకాలు సూచించాలని మరియు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ అన్నారు. గత శనివారం మేడిగడ్డ గోదావరిలో జరిగిన ప్రమాదానికి విచారణ వ్యక్తం చేసిన కిరణ్ ప్రమాదంలో మరణించిన యువకుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ మెడిగడ్డ గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించి బ్యారేజ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు మార్గదర్శకాలు సూచించే వారిని నియమించి ప్రమాదాలను అరికట్టాలని అన్నారు లేనిపక్షంలో టిఆర్ఎస్ తరఫున నిరసనలు తప్పవని హెచ్చరించారు.

అమెరికాలో ఆందోళనల కల్లోలం, లాస్ ఏంజిల్స్‎లో నిరసన జ్వాలలు!

మావోయిస్టుల దుశ్చర్య, బాంబుదాడిలో ఏఏస్పీ మృతి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు