Thursday, March 12, 2026
Homeఅంతర్జాతీయంఅమెరికాలో ఆందోళనల కల్లోలం, లాస్ ఏంజిల్స్‎లో నిరసన జ్వాలలు!

అమెరికాలో ఆందోళనల కల్లోలం, లాస్ ఏంజిల్స్‎లో నిరసన జ్వాలలు!

Los Angeles Protests: ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. గత మూడు రోజులుగా ఆందోళనలలతో లాస్ ఏంజెల్స్ అగ్నిగుండంగా మారింది. వలసదారులపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు రోడ్లెక్కి ఆందోళననలు నిర్వహిస్తున్నారు. భద్రతా బలగాలతో తలపడుతున్నారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.

అమెరికాలో ఆందోళనలు ఎందుకు?

అమెరికాకు వచ్చిన వలసదారులను అక్కడి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 వేల మందికి పైగా అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువగా అమెరికా నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో వసలదారులు అంతా మెక్సికన్ జెండాలు పట్టుకుని అమెరికాలో ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పలువురిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రధాన రహదారులను మూసివేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

 అమెరికా అధ్యక్షుడు ఏమన్నారంటే?

లాస్ ఏంజెల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఒకప్పుడు గొప్ప నగరంగా ఉన్న లాస్ ఏంజెల్స్ ఇప్పుడు అక్రమ వలసదారులు, నేరస్తులకు అడ్డగా మారిందన్నారు. ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. లాస్ ఏంజెల్స్ నుంచి వసలదారులను తరలించేందుకు అసవసరమైన చర్యలు చేపడుతామని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.  మరోవైపు లాస్ ఏంజెల్స్ ప్రజలు సంయమనంగా ఉండాలని మేయర్ కరెన్ బాస్ రిక్వెస్ట్ చేశారు. నగరం రీసెంట్ గా కార్చిచ్చు సహా పలు కష్టాలను ఎదుర్కొందని వెల్లడించారు. ఇప్పుడు ఆందోళనతో మరోసారి ఆగం చేయకూడదన్నారు. ప్రజలు శాంతిని కాపాడాలని మేయర్ రిక్వెస్ట్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను లాస్ ఏంజెల్స్ లో మోహరించడం తప్పు అని చెప్పిన ఆమె, వెంటనే వారిని వెనక్కి పిలవాలని సూచించారు. ఆందోళనకారులు శాంతియుతంగా నిరసనలు చేపట్టాలే తప్ప, హింసకు పాల్పడకూడదన్నారు.

Read Also: మావోయిస్టుల దుశ్చర్య, బాంబుదాడిలో ఏఏస్పీ మృతి!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments