Thursday, March 12, 2026
Homeజాతీయంమావోయిస్టుల దుశ్చర్య, బాంబుదాడిలో ఏఏస్పీ మృతి!

మావోయిస్టుల దుశ్చర్య, బాంబుదాడిలో ఏఏస్పీ మృతి!

ASP Akash Rao Girpunje Dead: ఓవైపు భద్రతా బలగాలు వెంటాడి వేటాడి ఏరివేస్తున్నా మావోయిస్టులు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా  పోలీసు వాహనం పేల్చేసి ఏఎస్పీని చంపేశారు. కొంట – గొల్లపల్లి రహదారిలో జరిగిన ఈ ఘటనలో సుక్మా జిల్లా ఏఎస్పీ ఆకాష్ రావు గిర్పుంజే మృతి చెందారు. కొత్త బేస్ క్యాంప్ కు దగ్గరలో ఈ ఘటన జరగడంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి.

ప్రొక్లెయిన్ కు నిప్పు పెట్టిన మావోయిస్టులు

భద్రతా బలగాలు చుట్టుముట్టి దాడులు చేస్తున్నా మావోయిస్టులు ఢీ అంటే ఢీ అంటున్నారు. కొంటా చిక్వార్ గూడ మైన్‌ లో ప్రోక్లెయిన్‌ మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటనను పరిశీలించేందుకు ఏఎస్పీ ఆకాష్ రావు గిర్పుంజే వచ్చారు. ఆ సమయంలో ఆయనను మావోయిస్టులు టార్గెట్ చేశారు. పోలీసు వాహనమే లక్ష్యంగా ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఏఎస్పీఓ పాటు మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే, భద్రతా సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఏఎస్పీకి చికిత్స అందించింది. అయినప్పటికీ, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆకాష్ రావు చనిపోయారు. ఈ ఘటనతో భద్రతా బలగాలు ఒక్కసారిగా షాకయ్యాయి. ఈఘటనకు పాల్పడిన మావోయిస్టుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు మమ్మరం చేశాయి.

మావోయిస్ అగ్రనేత సుధాకర్ అంత్య క్రియలు పూర్తి

మరోవైపు భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయిన మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ అంత్య క్రియలు పూర్తి అయ్యాయి.  ఆయన స్వగ్రామం ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం సత్యవోలులో ప్రజలు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. త్తీస్‌స్ గఢ్  బీజాపూర్‌ లో వారం రోజుల క్రితం జరిగిన ఎన్ కౌంటర్ లో సుధాకర్ హతమయ్యాడు. తాజాగా ఆయన మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం బీజాపూర్ నుంచి ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఆయన అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు మావోయిస్ సానుభూతి పరులు పాల్గొన్నారు. సుధాకర్ సోదరుడు ఆనందరావు ఈ అంత్యక్రియలు నిర్వహించారు.

Read Also: తోకాడిస్తే సర్వ నాశనమే, ఉగ్రవాదులకు షా స్టాంగ్ వార్నింగ్!

 

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments