Homeక్రైమ్క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించిన వ్యక్తి

క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించిన వ్యక్తి

హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. లోన్ రికవరీ కోసం వచ్చిన ఏజెంట్ పై కుక్కను వదిలాడు ఓ కస్టమర్. యజమాని వదిలిన కుక్క రికవరీ ఏజెంట్ పై దాడి చేసి కరిచింది. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్జ క్రెడిట్ కార్డు రికవరీ లోన్ ఏజెంట్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం స్పష్టించింది.

హైదరాబాద్ – మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రెడిట్ కార్డు బిల్లు కోసం వెళ్లిన ఓ ఏజెంట్ పై కుక్కని వదిలాడు యజమాని. జవహర్ నగర్‌కు చెందిన నందివర్ధన్ క్రెడిట్ కార్డు ద్వారా రెండు లక్షల అప్పు కట్టాల్సిన ఉంది.. అయితే రికవరీ చేయడానికి వచ్చిన ఏజెంట్ సత్య నారాయణపై కుక్కను వదలడంతో ఒక్కసారిగా మీద పడి కరిచింది. కుక్క గాయాల పాలైన బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

 

తాజావార్తలు