Homeఅంతర్జాతీయందేశంలోని ప్రతి ఒక్కరు తరలిరండి!... సనాతన ధర్మాన్ని చాటి చూపండి : సీఎం యోగి

దేశంలోని ప్రతి ఒక్కరు తరలిరండి!… సనాతన ధర్మాన్ని చాటి చూపండి : సీఎం యోగి

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మమే మన భారతదేశ జాతీయ మతం అని గర్వంగా చెప్పారు. సనాతన ధర్మం మన భారతదేశ గొప్పతనాన్ని తెలియజేస్తుందని అన్నారు. అంతేకాకుండా 144 సంవత్సరాలకి ఒకసారి జరిగేటువంటి ఈ మహా కుంభమేళాలో భారతదేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా 12 కోట్ల మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు.

కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించాలని ప్రజలను సీఎం యోగి కోరారు. మన సనాతన ధర్మం అంటే ఏంటో అందరికీ చాటి చూపాలని తెలిపారు. ప్రతిరోజు కూడా కొన్ని లక్షల్లో భక్తులు వచ్చి పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారని తెలిపారు. కాగా గత పరిపాలనలో కుంభమేళా ఏర్పాట్లలో అశ్రద్ధ వహించారని చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖ మరియు ప్రభుత్వ అధికారులు భక్తితో అలాగే క్రమశిక్షణతో పని చేస్తున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

1.నేనే ఎక్కువసార్లు గెలిచా.. సీఎం పదవిపై ఉత్తమ్ సంచలనం!

2.రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు!… అర్ధరాత్రి నుండి అకౌంట్లోకి డబ్బులు?

3.గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్పొరేటర్ సబిహా గౌసొద్దీన్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments