కారు రంగు కూడా దాని మైలేజ్‌పై ప్రభావం చూపుతుందనే ఆసక్తికరమైన విషయం మీకు తెలుసా? అవును, మీరు ఎంచుకునే కారు రంగును బట్టి కూడా ఇంధన వినియోగం ఆధారపడి ఉంటుంది.సాధారణంగా ముదురు రంగు కార్లు ఎండ తీవ్రతను ఎక్కువగా గ్రహిస్తాయి. ముఖ్యంగా నలుపు రంగు కారు అత్యధికంగా 62°C వేడిని పీల్చుకుంటుంది. దీనివల్ల కారు లోపల ఉష్ణోగ్రత పెరిగి, క్యాబిన్‌ను చల్లబరిచేందుకు ఏసీ (AC) ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా ఇంజిన్‌పై అదనపు భారం పడి వాహనం మైలేజ్ గణనీయంగా తగ్గుతుంది. నలుపుతో పాటు బ్రౌన్ (57°C), రెడ్ (51°C), ఎల్లో (51°C), బ్లూ (48°C), మరియు సిల్వర్ (47°C) రంగుల కార్లు కూడా వేడిని ఎక్కువగా గ్రహిస్తాయని నివేదికలు చెబుతున్నాయి.
అయితే, తెలుపు రంగు కారు మాత్రం కేవలం 43°C వేడిని మాత్రమే గ్రహిస్తుంది. తెలుపు రంగు వేడిని తక్కువగా పీల్చుకోవడం వల్ల కారు లోపల త్వరగా చల్లబడుతుంది. తద్వారా ఏసీ తక్కువగా పనిచేసి, ఇంజిన్‌పై లోడ్ తగ్గి కారు మైలేజ్ మెరుగ్గా ఉంటుంది. కాబట్టి, ఎండ వేడికి తక్కువగా ప్రభావితమై, మంచి మైలేజ్ ఇచ్చే వైట్ కలర్ కారును ఎంచుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు.
