-
అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రం అస్తవ్యస్తం
-
ముందు చూపు లేక.. అవసరానికి సరిపడా దొరకని విద్యుత్
-
వీధుల పైకి వచ్చి ప్రజల నిరసన
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తమిళనాడు ప్రజలు అనూహ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని గెలిపించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విజయ్ పార్టీ తమిళనాడులో గెలిచి అధికారం చేపట్టింది. ఆయన తన అధికారిక కాలాన్ని నెల రోజులపాటు పూర్తి చేసుకున్నారు.
అయితే తొలి నెలలోనే ఆయనకు ఊహించని రీతిలో షాక్ తగిలింది. పారిశ్రామికంగా, ఆర్థికంగా దేశంలో అగ్రగామిగా ఉన్న తమిళనాడులో అప్రకటిత విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయి.
Also Read: షాకింగ్: టీవీ నటి సంచితా ఉగాలే ఆత్మహత్య.. అభిమానుల్లో విషాదం – Crime Mirror
ప్రజల్లో అసహనాన్ని పెంచాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సరఫరాకు మధ్య అగాధం రోజురోజుకు పెరుగుతోంది. సహజంగానే ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అప్రకటిత విద్యుత్ కోతలను తప్పు పడతారు. తొలి నెలలోనే విజయ్ సర్కార్ పై ప్రజామోదం భిన్నంగా సాగింది.
-
ఆ పెద్ద నగరాల్లో సైతం..
తమిళనాడులో పెద్ద నగరాలుగా గుర్తింపు పొందిన చెన్నై, కోయంబత్తూర్, తిరుచి, మధురై వంటి ప్రధాన నగరాలతో పాటు పారిశ్రామిక వాడల్లో రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చెప్పనవసరం లేదు.
ఎండల తీవ్రతకు ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడంతో గ్రిడ్ లపై అదనపు భారం పడుతోంది. బొగ్గు కొరత, పంపిణీ వ్యవస్థల వైఫల్యంతో విద్యుత్ బోర్డు సైతం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఈ సంక్షోభానికి సీఎం విజయ్ తో పాటు ఆయన బృందానికి పాలనా అనుభవం లేకపోవడమే ప్రధాన కారణం అన్న విమర్శలు తమిళనాడులో వ్యక్తమవుతున్నాయి.
-
ప్రభుత్వ సమన్వయ లోపం..
సాధారణంగా వేసవికాలంలో వచ్చే గరిష్ట డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ప్రైవేటు సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఈ విషయంలో మాత్రం విజయ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.
విద్యుత్ శాఖలో ఉన్న సీనియర్ అధికారుల సమన్వయ లోపం, కొత్త విధానాలపై ముఖ్యమంత్రికి పట్టు లేకపోవడం వల్లే పారిశ్రామిక రంగానికి పవర్ హాలిడేలు ప్రకటించాల్సిన దుస్థితి వచ్చిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
Also Read: ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’ కి అసలైన నిర్వచనం ఇదే మావా… – Crime Mirror
ఆదిలోనే విజయ్ పనితీరుపై విమర్శలు వస్తుండడం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అవుతోంది. వేసవిని దృష్టిలో పెట్టుకొని కనీసం ముందస్తు చర్యలు చేపట్టడంలో కూడా విఫలం కావడానికి విపక్షాలు ఒక అస్త్రంగా మార్చుకుంటున్నాయి.
-
పరిశ్రమలు మూత..
విజయ్ కు దాదాపు ఈ రెండు నెలల పాలన గట్టిగానే షాక్ చూపింది. సినిమా షూటింగుల్లో స్క్రిప్ట్ ప్రకారం సీన్లు చేయడం సులువే కానీ.. కోట్లాదిమంది ప్రజల నిత్యవసరమైన కరెంట్, మౌలిక వసతులు సమకూర్చడం విజయ్‌కు అంత సులువు కాదని సెటైర్లు పడుతున్నాయి.
ఒకవైపు విద్యుత్ లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. మరోవైపు ఉక్కపోతతో రాత్రిపూట నిద్రలేక సామాన్య జనం రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అయితే విజయ్ కు ఇది ఒక హెచ్చరిక లాంటిది. మున్ముందు మాత్రం ముందు చూపుతో పాలన చేయకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.
Also Read: గ్రేటర్ కు దూరంగా బండి సంజయ్…! – Crime Mirror
Also Read: వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయం.. – Crime Mirror