తెలంగాణ

అశ్విని ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి.. వాళ్లను చూసి కన్నీళ్లు

ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతా ఇంతా కాదు. వర్షాలు తగ్గి మూడు రోజులైనా ఖమ్మం జనం ఇంకా తేరుకోలేదు. వరదల్లో యువ సైంటిస్ట్ కొట్టుకుపోవడం అందరిని కలిచివేస్తోంది. భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగింది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఆ సమయంలోనే అటుగా కారులో వస్తున్న యువ శాస్త్రవేత్త అశ్విని కారు వరదలో చిక్కుకుపోయింది. అశ్వినితో పాటు ఆమె తండ్రి మోతీలాల్ వరదలో కొట్టుకుపోయారు. రాయపూర్ లోని ప్రసిద్ది కాలేజీలో చదువుతోంది. కాలేజీలో ముఖ్యమైన సదస్సు ఉండటంతో భారీ వర్షం వస్తున్నా రాయపుర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళుతోంది. తన కూతూరిని విమానాశ్రయంలో డ్రాప్ చేసేందుకు మోతిలాల్ వెళుతున్నారు. దురదుష్టం వెంటాడటంతో వాళ్ల కారు వరదలో చిక్కుకుని కొట్టుకుపోయింది. యువ శాస్త్రవేతను బలి తీసుకుంది.

వరదల్లో చనిపోయిన యువ సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించేందుకు సీతారాంపురం తండా వెళ్లారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి. అశ్విని మాతృమూర్తి, సోదరుడుని పరామర్శించారు. అశ్విని యువ శాస్త్రవేత్త ఆమె మరణం బాధాకరమన్నారు రేవంత్ రెడ్డి. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అశ్విని కుటుంబానికి ఇల్లు లేదని.. ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో రెండు తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ఈ మూడు తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు గాను అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్ ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు,ఆధార్ కార్డులు,సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే దాఖలు చేసి అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆకేరు ప్రవాహం నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మించాలని సీఎం ఆదేశించారు.

Related Articles

Back to top button