గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదని చెప్పారు.మల్కాపూర్ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సంగారెడ్డి ఘటనలో హోం గార్డ్ కి గాయమై చనిపోతే… హైడ్రా బలి తీసుకుంది అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం దురదృష్టకరమన్నారు రంగనాథ్.
కూల్చివేతలు అన్నీ హైడ్రా కు ముడి పెట్టవద్దని విన్నవించారు రంగనాథ్. సంగారెడ్డి ఘటనను హైడ్రా కు ముడిపెడుతూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం విచారకరమన్నారు. హైడ్రా యిలాంటి తప్పుడు వార్తలు ఖండిస్తుందన్నారు.హైడ్రాను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను సామాజిక మాధ్యమాలు అనుసరించవద్దని కోరారు.హైడ్రా కు సంబంధం లేని ఘటనలను ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ అప్రతిష్టపాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు.
ఇటీవల కూకట్పల్లి చెరువు పరిసరాల్లో ఇంటిని కూల్చి వేస్తారేమో అని బుచ్చమ్మ అనే మహిళా ఆత్మహత్య చేసుకోవడాన్ని కూడా హైడ్రకు ఆపాదించారని రంగనాథ్ అన్నారు. బుచ్చమ్మకు హైడ్రా నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. అదిలాబాద్ జిల్లాలో కూల్చివేతలు జరిగిన హైడ్రాకు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఔటర్ రింగు రోడ్డు వరకే హైడ్రా పరిధి అనేది అందరూ గ్రహించాలని రంగనాథ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి …
KT Ramarao : బామ్మర్ది లీగల్ నోటీస్ ఇస్తే భయపడిపోతానా!
MLA RajaSingh : రోడ్డెక్కిన ఎమ్మెల్యే రాజా సింగ్.. పాతబస్తీలో హై టెన్షన్
Ranganath HYDRA : హైకోర్టుకు హైడ్రా కమిషనర్.. కూల్చివేతలకు బ్రేక్!
TeenMar Mallanna : రేవంత్‌పై తీన్మార్ మల్లన్న తిరుగుబాటు.. ఆయన వెనకున్నదెవరు?