Homeసినిమారేపు ఓటీటీలోకి రెండు సూపర్ హిట్ మూవీస్?

రేపు ఓటీటీలోకి రెండు సూపర్ హిట్ మూవీస్?

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- సంక్రాంతికి బరిలో దిగిన స్టార్ హీరోల సినిమాలు మెల్లిగా ఒక్కొక్కటి ఓటీటీలో విడుదలవుతూ ఉన్నాయి. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఓటీటీ లో విడుదలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఎల్లుండి మరో సినిమా ఓటీటీ లోకి రానుంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వచ్చినటువంటి అనగనగా ఒక రాజు సినిమా రేపు ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి netflix లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవునుంది. సంక్రాంతి చివరి రోజున రిలీజ్ అయినటువంటి ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం తోపాటు మంచి వసూలు కూడా రాబడినట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు చిరంజీవి “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే సినిమా కూడా 11వ తేదీ నుంచి జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ప్రభాస్ సినిమా జియో హాట్ స్టార్, శర్వానంద్ మూవీ ప్రైమ్ వీడియోలో, దురంధర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రెండు రోజుల్లో మిగిలిన చిరంజీవి మరియు నవీన్ పోలిశెట్టి సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.

Read also : నిద్రపోతున్న నిఘానేత్రలు.. రెండు నెలలుగా స్తంభాలకు వేలాడుతున్న సి సి కెమెరాలు

Read also : Graduation Day Celebrations: ఆలోచించే స్కిట్స్.. ఆహ్లాదపరిచే డ్యాన్సులు.. అట్టహాసంగా ‘మౌంట్ ఫోర్ట్’ గ్రాడ్యుయేషన్ వేడుకలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments