Homeక్రైమ్రిమ్స్‌ అగ్నిప్రమాదంలో విషాదం: ఐదుకు చేరిన చిన్నారుల మృత్యుసంఖ్య..

రిమ్స్‌ అగ్నిప్రమాదంలో విషాదం: ఐదుకు చేరిన చిన్నారుల మృత్యుసంఖ్య..

క్రైమ్ మిర్రర్ : ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో తీవ్ర విషాదం నెలకుంది. ప్రమాద ధాటికి ప్రాణాలు కోల్పోయిన పసికందుల సంఖ్య ఐదుకు చేరడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర గుండెకోత మిగిలింది. అంతేకాకుండా, ప్రస్తుతం తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న మరో 20 మంది చిన్నారుల ఆరోగ్యం సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

అసలేం జరిగింది?

సోమవారం అర్ధరాత్రి వేళ రిమ్స్ ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. వార్డులోని ఎయిర్ కండిషనర్ (AC) పేలిపోవడంతో క్షణాల్లోనే దట్టమైన పొగలు వార్డును కమ్మేశాయి. దీంతో అక్కడ ఉన్న పసికందులు ఊపిరాడక విలవిలలాడారు. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది, రక్షణ చర్యలు చేపట్టి వార్డులో చికిత్స పొందుతున్న సుమారు 30 మంది చిన్నారులను వెలుపలికి తీసుకొచ్చారు.

వెలుగులోకి వస్తున్న చేదు నిజాలు:

ఈ అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఒక పసికందు ప్రాణాలు కోల్పోగా, దట్టమైన పొగ పీల్చి తీవ్ర స్పృహతప్పి అస్వస్థతకు గురైన పలువురు పిల్లలను అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మంగళవారం హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే మరో ఇద్దరు పసికందులు విగతజీవులుగా మారారు. కాగా, ఈ మరణాల విషయాన్ని బయటకు పొక్కకుండా రిమ్స్ యాజమాన్యం కొంతసేపు రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరు చిన్నారుల ఆరోగ్యం క్షీణించడంతో, పరిస్థితి చేయిదాటక ముందే వారిని సమీపంలోని ప్రైవేట్ దవాఖానాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఓ చిన్నారి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. తన కళ్ల ముందే పిల్లలు అస్వస్థతకు గురై ప్రాణాలు విడుస్తుండటంతో తల్లిదండ్రుల ఆవేదన, రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటింది. వైఫల్యాలకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
also read : బస్సు చక్రాల కింద పడి మూడేళ్ల చిన్నారి దుర్మరణం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు