Homeజాతీయంకొత్తగా ముగ్గురికి...! ఢిల్లీ బాటపడుతున్న సీనియర్లు...

కొత్తగా ముగ్గురికి…! ఢిల్లీ బాటపడుతున్న సీనియర్లు…

  • పెద్దల మద్దతు కోసం గట్టి ప్రయత్నాలు

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ తప్పకుండా జరుగుతుందన్న ప్రచారం నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన, పార్టీ పదవులపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. దీంతో ఆశావహులు ఢిల్లీ బాట పడుతున్నారు. మంత్రి పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న ఇద్దరు పదవులు కోల్పోవడం ఖాయమని తెలుస్తోంది. ముగ్గురికి కొత్తగా ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ ముగ్గురు అదృష్టవంతులు ఎవరు అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది.

ఆ ఇద్దరు నేతలు పోటాపోటీగా…

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటుతోంది. కచ్చితంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు కాంగ్రెస్ సై కమాండ్ నిర్ణయించింది. దీంతో ఈసారైనా మంత్రి పదవి దక్కించుకోవాలని పలువురు ఆశావహులు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు పనితీరు ఆధారంగా కొందరిని మార్చి అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు సామాజిక ప్రాంతీయ సమీకరణ రీత్యా పలువురికి చాన్స్ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఉటాహుటినా పుట్టిన ఢిల్లీకి చేరుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకే అవకాశం కల్పించాలని గతంలోని ఆయన కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ఢిల్లీ బాట పట్టారు. అయితే తెర వెనుక చాలామంది నేతలు ఢిల్లీ వెళ్లి పెద్దలను కలుస్తున్నట్లు తెలుస్తోంది.

మరో డిప్యూటీ సీఎం…

మరో బీసీమంత్రికి డిప్యూటీ సీఎం గా అవకాశం ఇవ్వాలని ప్రతిపాదనపై హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న ఒక మహిళా మంత్రిత్వ పాటు మరో ఇద్దరు మంత్రులు పదవుల్లో కొనసాగడం పై చర్చలు సాగుతున్నాయి. జయశాంతితో పాటు కోదండరాంకు ఉన్న అవకాశం పై అంచనాలు వినిపిస్తున్నాయి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను క్యాబినెట్లోకి తీసుకొని.. పొన్నం ప్రభాకర్కు ఆ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం ఉంది. అయితే మంత్రివర్గ పూర్తి విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి హై కమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చే పరిస్థితి ఉంది. దీంతో క్యాబినెట్ లోకి ఎవరికి అవకాశం దక్కుతుంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 2న మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు