Homeక్రైమ్కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది సజీవ దహనం

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది సజీవ దహనం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మిర్జా గాలిబ్ వీధిలో జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతులంతా బంగ్లాదేశ్‌కు చెందినవారేనని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో మిర్జా గాలిబ్ వీధిలోని ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు బయటకు వచ్చేందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం భవనంలో సహాయక చర్యలు చేపట్టగా.. తొమ్మిది మంది అప్పటికే మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.

మృతులంతా వైద్య చికిత్స కోసం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్‌సర్క్యూట్‌ సహా ఇతర కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు.. మహిళా ఉద్యోగులకు తమిళనాడు సర్కార్ గుడ్‌న్యూస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు