ఆంధ్ర ప్రదేశ్

విద్యార్థిని తొడ కొరిగిన టీచర్.. ఇంట్లో చెప్తే చంపేస్తా అంటూ బెదిరింపులు

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు.. అభం శుభం తెలియని చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందిన కృష్ణా జిల్లా ఘటన కోడూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని నరసింహపురం ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు పది మంది పిల్లలు చదువుతున్నారు. అవినిగడ్డ కు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వేణుగోపాలరావు విద్యాశాఖ అనుమతులు లేకుండా మరొక ప్రైవేట్ టీచర్ ను పెట్టుకుని విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. బాధ్యత మొత్తం ఆర్ టీచర్ పైనే వదిలేసి వేణుగోపాలరావు పాఠశాలలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

మూడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో ఉపాధ్యాయుడు వేణుగోపాలరావు నాలుగు రోజుల నుంచి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. చిన్నారి చెప్పుకోలేని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. సోమవారం ఉదయం సదరు విద్యార్థిని పాఠశాలకు వెళ్ళగానే వేణుగోపాలరావు తన నీచ బుద్ధి చూపించాడు. విద్యార్థిని వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచి పై కూర్చోబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్ అంటూ ఏడుస్తున్న కూడా కనికరించకుండా పళ్ళగాట్లు పడేలా కోరిగాడు.

తొడపై కొరికిన విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానంటూ ఉపాధ్యాయుడు వేణుగోపాలరావు బెదిరించినట్లు విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తెలిపింది. ఉపాధ్యాయుడు నాలుగు రోజుల నుంచి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఎక్కడపడితే అక్కడ తాగుతున్నాడని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు విద్యార్థిని పరిశీలించగా తొడపై ఉపాధ్యాయుడు పళ్ళగాట్లు ఉండడాన్ని గమనించారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

తలకాయే తీసేసారు.. రాహుల్ పర్యటన రోజే దారుణం

మరో ఆలయంలో దాడి.. తెలంగాణలో అసలేం జరుగుతోంది?

మంత్రి ఉత్తంపై మంత్రి కోమటిరెడ్డి అనుచరుడి విమర్శలు

మంత్రులను తీన్మార్ మల్లన్నతో రేవంతే తిట్టిస్తున్నాడా?

తీన్మార్ మల్లన్నపై రేవంత్ గురి.. ఆర్ కృష్ణయ్యతో స్కెచ్!

సీఎం రేవంత్ సంచలనం.. ఈనెల 8 నుంచి పాదయాత్ర

Back to top button