రాబోయే సంక్రాంతికి బరిలో స్టార్ హీరోల సినిమాలు

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు ఈమధ్య దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న తరుణంలో స్టార్ హీరోలు సైతం ఏడాదికి ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే సంక్రాంతి బరిలో ప్రభాస్,చిరంజీవి రవితేజ వంటి స్టార్ హీరోలు నిలువగా రాబోయే సంక్రాంతికి కూడా మరో నలుగురు స్టార్ హీరోలు ఈ బరిలో నిలుస్తున్నట్లు సమాచారం. వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ స్టార్ హీరోలు రాబోయే సంక్రాంతి బరిలో పోటీ పడడం మొట్టమొదటిసారి. చిరంజీవి- బాబి, బాలయ్య-గోపీచంద్ మలినేని, నాగార్జున-కళ్యాణ్ కృష్ణ,వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాలు ఈసారి సంక్రాంతికి ఇప్పటినుంచి రెడీ అవుతున్నాయి. ఒకవేళ ఈ హీరోల సినిమాలు షూటింగ్ అనుకున్న సమయానికి కంప్లీట్ అయితే కచ్చితంగా ఈ నలుగురు సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నలుగు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిస్తే వచ్చే సంక్రాంతి విన్నర్ ఎవరనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాగా ఈ సంక్రాంతి విన్నర్ గా చిరంజీవి సినిమా నిలిచిన విషయం తెలిసిందే. కానీ వీణట్టికి మించి రాబోయే సంక్రాంతి మూడ్ ఉంటుందని సినీ ప్రేక్షకులు సైతం అంటున్నారు.

Read also : స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్ ఇచ్చిన BCCI

Read also : టెన్త్‌ విద్యార్థినితో ఉపాధ్యాయుడి రహస్య వివాహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button