Homeక్రైమ్ఆటో డ్రైవ‌ర్‌కు ఎస్‌పీ అభినంద‌న‌లు...ఎందుకో తెలుసా ?

ఆటో డ్రైవ‌ర్‌కు ఎస్‌పీ అభినంద‌న‌లు…ఎందుకో తెలుసా ?

  • రూ.30 లక్షల బంగారం అప్పగింత

ఒంగోలు, క్రైమ్ మిర్ర‌ర్: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని త‌న మంచి మ‌న‌స్సును చాటుకున్నారు. త‌న ఆటోలో ప్ర‌యాణించిన ప్రయాణికులు ఆటోలో 30ల‌క్ష‌ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను మ‌రిచిపోయారు. దీంతో గ‌మ‌నించిన ఆటో డ్రైవ‌ర్ బంగారు ఆభ‌ర‌ణాల‌ను పోలీసుల‌కు అప్ప‌గించి ప‌లువురురికి ఆద‌ర్శంగా నిలిచారు. దీంతో ప‌లువురు అభినంద‌లు తెలుపుతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే విజ‌య‌వాడ‌కుచెందిన సుబ్బ‌రావు త‌న కుటుంబంతో క‌లిసి ఒంగుల‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆటో ఎక్కి గ‌మ్య స్థానం చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో హ‌డావిడిలో త‌న బంగారం ఉన్న బ్యాగును అందులో మ‌రిచిపోయారు. కాసేప‌టికి విష‌యం గుర్తించిన సుబ్బ‌రావుకు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

కాగా మరోవైపు ప్రయాణికులు దిగి వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు తన వాహనంలో బ్యాగును గమనించారు. అది తన ఆటోలో ప్రయాణించిన వారిదేనని భావించి, వారి కోసం సమీప ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో నేరుగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్యాగును పోలీసులకు అప్పగించారు. పోలీసులు బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే సుబ్బారావుకు సమాచారం ఇచ్చి, నగలను ఆయనకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు నిజాయితీని మెచ్చి సత్కరించారు. ఇదే తరహాలో మరో ఘటనలో ప్రయాణికులు మర్చిపోయిన బంగారాన్ని అప్పగించిన ఆటో డ్రైవర్ ఖలీల్ ను కూడా ఎస్పీ అభినందించారు.

తాజావార్తలు