HomeజాతీయంSasikala New Party: తమిళనాడులో కొత్త పార్టీ పెట్టిన శశికళ, పేరేంటో తెలుసా?

Sasikala New Party: తమిళనాడులో కొత్త పార్టీ పెట్టిన శశికళ, పేరేంటో తెలుసా?

  • తమిళనాడులో మరో పురుడుపోసుకున్న కొత్త పార్టీ
  • పార్టీ పెట్టిన జయలలిత సన్నిహితురాలు శశికల
  • తమిళ ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించేనా?

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ప్రారంభమైంది. జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జయలలిత 78వ జయంతిని పురస్కరించుకుని రామనాథపురంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఆమె.. త్వరలోనే పార్టీ పేరును వెల్లడిస్తానని తెలిపారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులు గల పతాకంపై దివంగత సీఎంలు అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత చిత్రాలున్నాయి.

తొందరపడి పళనిస్వామిని సీఎం చేశాం!

పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా శశికళ.. మాజీ సీఎం పళనిస్వామిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు, అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టారని విమర్శించారు. తాము తొందరపడి ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎంచుకున్నామన్నారు. అప్పటికి ఆయన ఎలాంటి వ్యక్తో తమకు తెలియదన్నారు. ఆయన్ను నేను సీఎం కుర్చీలో కూర్చోపెడితే, నన్ను పార్టీ నుంచి తొలగిస్తూ తీర్మానం చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు భర్త చనిపోతే, అధికారులు 15 రోజులు పెరోల్‌ మంజూరు చేశారు. అయితే నాకు 5 రోజుల కంటే ఎక్కువ పెరోల్‌ ఇవ్వకూడదని ఉత్తర్వులు తెప్పించారని మండిపడ్డారు. తాను ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి తనకే వెన్నుపోటు పొడిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు