Homeసినిమాఈసారి డబుల్ కాంబోలో మళ్లీ సంక్రాంతి వస్తున్నాం : అనిల్ రావిపూడి

ఈసారి డబుల్ కాంబోలో మళ్లీ సంక్రాంతి వస్తున్నాం : అనిల్ రావిపూడి

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లలో వరుస సినిమాలలో విజయం సాధిస్తూ మరో రాజమౌళిలా కనిపిస్తున్నటువంటి అనిల్ రావుపూడి తన తర్వాతి సినిమాను తాజాగా ప్రకటించారు. తన కెరీర్లో మొదటిసారి సినిమా తీసే అవకాశం ఇచ్చినటువంటి నందమూరి కళ్యాణ్ రామ్ మరోవైపు నా సినిమా కెరీర్ లో 100 కోట్ల రూపాయల హిట్ కొట్టించినటువంటి హీరో వెంకటేష్ కాంబోలో సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా 2027 పండుగ సమయంలో విడుదల చేస్తున్నాము అని తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. గత రెండు మూడు ఏళ్ల నుంచి ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ చేస్తూ మంచి సూపర్ హిట్ లు కొట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాజాగా చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చినటువంటి మన శంకర్ వరప్రసాద్ ఎంత సూపర్ హిట్గా నిలిచింది అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సంక్రాంతి అనిల్ రావుపూడికి బాగా కలిసి రావడంతో తన తర్వాత సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫాన్స్ సైతం ఈసారి విక్టరీ వెంకటేష్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Telangana: ఉద్యోగులకు భారీ ఊరట.. పెండింగ్ బిల్లులకు రూ.745 కోట్లు విడుదల

హైద‌రాబాద్ లో మ‌రో హైటెక్ ర‌వాణ‌కు శ్రీ‌కారం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు