Homeవైరల్ఒకే వరుడికి ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పెళ్లి… అమ్రోహాలో వైరల్ అయిన విభిన్న వివాహ వేడుక

ఒకే వరుడికి ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పెళ్లి… అమ్రోహాలో వైరల్ అయిన విభిన్న వివాహ వేడుక

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఒక విభిన్నమైన వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వికాస్ అనే యువకుడు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్న ఘటన స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

సమాచారం ప్రకారం, ఈ ముగ్గురు యువతులు వికాస్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నారు. కాలక్రమేణా ఆ పరిచయం మరింత బలపడటంతో, ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని భావించిన అక్కాచెల్లెళ్లు ముగ్గురూ కలిసి వికాస్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

జులై 17న చాముండా మాత ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో ఈ వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన అక్కాచెల్లెళ్లు, తాము అందరూ మేజర్లమని, ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ స్వచ్ఛంద నిర్ణయంతోనే ఈ వివాహం చేసుకున్నామని తెలిపారు. అయితే, ఈ వివాహం చట్టపరంగా ఎలా పరిగణించబడుతుంది? అనే అంశంపై వివిధ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

also read: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. న్యాయస్థానాన్ని పట్టించుకోరా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు