Homeజాతీయంవందేమాతరం గేయానికి గౌరవం తప్పనిసరి.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

వందేమాతరం గేయానికి గౌరవం తప్పనిసరి.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ‘వందేమాతరం’ గేయానికి మరింత గౌరవం కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. గేయాన్ని అవమానించడం లేదా దాని ఆలాపనలో నిబంధనలు పాటించకపోవడాన్ని నేరంగా పరిగణించే బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ బిల్లు చట్టరూపంలో అమల్లోకి రానుంది.

కొత్త నిబంధనల ప్రకారం, ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తి గౌరవంతో, సక్రమంగా ఆలపించడం తప్పనిసరి అవుతుంది. గేయాన్ని తేలికగా తీసుకోవడం, అనుచితంగా వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించనున్నారు.

ఈ చట్టం ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గేయాన్ని సరదాగా రింగ్‌టోన్‌లుగా వినియోగించడం, సినిమాల్లో లేదా ఇతర వేదికలపై ఇష్టానుసారం ఉపయోగించడం వంటి చర్యలను నిషేధించారు.

దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ గేయాన్ని ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతతో, గౌరవంతో చూసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈ నిర్ణయం దేశభక్తి భావాన్ని మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

also read: యువ క్రికెటర్ ఆత్మహత్య.. జట్టు ఎంపికల్లో అవకాశం దక్కలేదని దారుణం- నాగ్‌పూర్‌లో విషాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు