Homeక్రైమ్హైదరాబాద్‌లో నడిరోడ్డుపై రియల్టర్ దారుణ హత్య..!

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై రియల్టర్ దారుణ హత్య..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నం (46) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన నేడు (డిసెంబర్ 8, 2025) ఉదయం సాకేత్ కాలనీలోని ఒక పాఠశాల సమీపంలో నడిరోడ్డుపై జరిగింది.

ఇక వివరాలు ఇలా వున్నాయి.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ, ఫోస్టర్ బిల్లాబాంగ్ స్కూల్ ముందు. వెంకటరత్నం తన పాపను పాఠశాలలో దింపి స్కూటీపై తిరిగి వెళ్తుండగా, దుండగులు అతన్ని వెంబడించారు.

మొదట తుపాకీతో కాల్పులు జరిపి, ఆ తర్వాత కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. పాత కక్షలు లేదా ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.  మృతుడు వెంకటరత్నంపై గతంలో ధూల్‌పేట్‌లో డబుల్ మర్డర్ కేసుతో పాటు రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు