క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం “మెగా158” టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఈ కొత్త సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా కుటుంబానికి చెందిన ప్రముఖులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అతిథులుగా రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది.పూజా కార్యక్రమంలో చిరంజీవితో కలిసి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ అరుదైన కాంబినేషన్‌ను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో భారీ స్థాయిలో తెరకెక్కనున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మెగా158 షూటింగ్ త్వరలోనే రెగ్యులర్‌గా ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.