ఆంధ్ర ప్రదేశ్

తిరుమల వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి!..

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి ఆర్ నాయుడు కొన్ని కీలక అంశాలను తెలియజేశారు. జనవరి 10వ తారీకు నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన తెలిపారు. కాబట్టి మొదటి రోజు జనవరి 10వ తారీఖున ఉదయం నాలుగు గంటల 30 నిమిషాలకు ప్రోటోకాల్ అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 8 గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని అన్నారు.

Read More : తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి సెలవులు!… ఎన్ని రోజులు అంటే?

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక దర్శనాలను 10 రోజులు పాటుగా రద్దు చేశామని అన్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రస్తుతం టికెట్లు లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు ఎదుర్కోవద్దని తెలియజేశారు. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం లో దాదాపుగా మూడువేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే భద్రత విషయంలో కూడా పోలీసులు ముందస్తు భాగంగా చర్యలు తీసుకుంటున్నారు అని అన్నారు.

Read More : రేవంత్ పెట్టే లొట్ట పీసు కేసులకు నేను భయపడను: కేటీఆర్

అయితే కొన్ని రోజులుగా ప్రజలను భయపెడుతున్న HMPV వైరస్ అలజడి నేపథ్యంలో భక్తులు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు కోరారు. తిరుమలలో పదో తారీకు నుంచి మొదలయ్యేటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో చాలామంది భక్తులు పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు.

Read More : నందిగాం సురేష్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు!..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button