HomeతెలంగాణMunicipal Election Campaign: కార్పొరేటర్ గా గెలిపించండి, అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తా: గుర్రం వెంకన్న

Municipal Election Campaign: కార్పొరేటర్ గా గెలిపించండి, అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తా: గుర్రం వెంకన్న

Gurram Venkanna Municipal Election Campaign: నల్లగొండలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గుర్రం వెంకన్న ప్రచారం ముమ్మరం చేశారు. తన డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలను తిరుగుతూ, ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా డివిజన్ తో ఉన్న అనుబంధం ఉందని, అందరి కుటుంబ సభ్యుడిగా మెలుగుతున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ బరిలో నిలిచిన తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సింహం గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో విజయాన్ని అందించాలన్నారు.

అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తా!

తాజాగా 41వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీ,  పద్మావతి కాలనీ, ఆండాలు వీధితో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. తన దగ్గర పంచేందుకు డబ్బులు లేవని, ఇతర పార్టీల అభ్యర్థుల మాదిరిగా డబ్బులు, మద్యం పంచలేనని చెప్పారు. తనను గెలిపిస్తే నిజాయితీగా ప్రజలకు పని చేస్తానని చెప్పారు. 41వ డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు గుర్రం వెంకన్న.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు