అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళా క్రికెటర్ల సంక్షేమం దిశగా కీలక అడుగు వేసింది. 2026 జూన్‌లో ప్రసవం అనంతరం మళ్లీ ఆటలోకి చేరే మహిళా ఆటగాళ్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయం మహిళా క్రీడాకారిణుల కెరీర్‌కు మరింత భరోసా ఇవ్వడమే కాకుండా, క్రీడా ప్రపంచంలో సమాన అవకాశాలకు కొత్త దారులు తెరిచింది. ఈ మార్గదర్శకాలను ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఫిలిప్పా ఇంగే ఆధ్వర్యంలో రూపొందించారు. ‘6Rలు’ (Ready, Review, Restore, Recondition, Return, Refine) అనే ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది.
6R ఫ్రేమ్‌వర్క్ అంటే ఏమిటి?
Ready – ఆటగాళ్లు తిరిగి క్రీడలోకి రావడానికి శారీరక, మానసికంగా సిద్ధమవడం
Review – ఆరోగ్య పరిస్థితుల సమీక్ష
Restore – శరీర శక్తి, ఫిట్‌నెస్ పునరుద్ధరణ
Recondition – ఆటకు అవసరమైన ఫిట్‌నెస్ ట్రైనింగ్
Return – మైదానంలోకి తిరిగి ప్రవేశం
Refine – ప్రదర్శనను మెరుగుపరచడం
ఈ గైడ్‌లైన్స్ ద్వారా సభ్య దేశాలు తమ మహిళా క్రికెటర్లకు సరైన మద్దతు అందించగలవని ఐసీసీ భావిస్తోంది. ముఖ్యంగా ప్రసవం తర్వాత ఆటగాళ్లకు అవసరమైన మెడికల్, ఫిట్‌నెస్, మానసిక సహాయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. డాక్టర్ ఫిలిప్పా ఇంగే మాట్లాడుతూ, “గర్భధారణ లేదా మాతృత్వం కారణంగా మహిళలు తమ క్రీడా జీవితాన్ని ముగించాల్సిన అవసరం లేదు. సరైన మద్దతు ఉంటే వారు మరింత బలంగా తిరిగి రావచ్చు” అని తెలిపారు.
కాగా.. ఇటీవల అంతర్జాతీయ క్రీడా సంస్థలు మహిళా ఆటగాళ్ల కోసం మెటర్నిటీ పాలసీలను బలోపేతం చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే గర్భిణీ క్రీడాకారిణులకు ప్రత్యేక లీవ్, ఫైనాన్షియల్ సపోర్ట్ అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం యువతులకు క్రీడల్లో కొనసాగడానికి మరింత ప్రేరణనిస్తుంది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం మహిళా క్రికెట్‌లో గేమ్-చేంజర్‌గా మారే అవకాశం ఉంది. మాతృత్వం తర్వాత కూడా కెరీర్ కొనసాగించాలనుకునే క్రీడాకారిణులకు ఇది పెద్ద ఊరటగా మారింది.
also read: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!!