Homeఆంధ్ర ప్రదేశ్విశాఖకు మ‌హ‌ర్ధ‌శ‌...! 50ఏళ్ల‌కు త‌గ్గ‌ట్టుగా ఏపీ ప్ర‌భుత్వం మాస్ట‌ర్ ప్లాన్‌...

విశాఖకు మ‌హ‌ర్ధ‌శ‌…! 50ఏళ్ల‌కు త‌గ్గ‌ట్టుగా ఏపీ ప్ర‌భుత్వం మాస్ట‌ర్ ప్లాన్‌…

విశాఖపట్టణం, క్రైమ్‌మిర్ర‌ర్‌: విశాఖ నగరాన్ని రాబోయే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగురోడ్డు నిర్మించనున్నారు. భోగాపురం విమానాశ్రయానికి ఏడు కనెక్టింగ్ రోడ్లు, బీచ్ కారిడార్‌తో పాటు రూ.14 వేల కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఉత్తరాంధ్రను ప్రత్యేక అభివృద్ధి జోన్‌గా మారుస్తూ ఆర్థిక కారిడార్‌ను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం నగరాన్ని రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను అమలు చేస్తోంది. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సుమారు 6,836 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వీఎంఆర్డీఏ పరిధిని మరింత పటిష్టం చేస్తూ.. నగరం నలుమూలలా విస్తరించేలా చర్యలు చేపట్టారు.విశాఖ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించడానికి రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల పొడవైన సెమీ రింగురోడ్డును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఈ నెలాఖరు నాటికి సిద్ధం కానుంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే.. నగరం మధ్యలోకి భారీ వాహనాలు రాకుండా నేరుగా హైవేలకు అనుసంధానం అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా నగర శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి.నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రాధాన్యతనిస్తూ.. దానికి ఏడు కనెక్టింగ్ రోడ్లను వీఎంఆర్డీఏ నిర్మిస్తోంది. ఇప్పటికే మూడు రోడ్ల నిర్మాణం పూర్తి కాగా.. మిగిలినవి తుది దశలో ఉన్నాయి.

విశాఖ నగరం నుంచి భోగాపురం వరకు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక బీచ్ కారిడార్‌ను కూడా ప్రతిపాదించారు. ఇది పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే కాకుండా సముద్ర తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతుంది.నగరవాసుల ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు రూ.14 వేల కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖలోని 95 శాతం ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని మంత్రి నారాయణ వివరించారు. అలాగే మాస్టర్ ప్లాన్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన 90 శాతం వినతులను అధికారులు పరిష్కరించారు. ఉత్తరాంధ్రను ప్రత్యేక అభివృద్ధి జోన్‌గా మార్చడమే లక్ష్యంగా.. విశాఖ ఎకనామిక్ కారిడార్‌ను బలోపేతం చేస్తూ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు విశాఖను గ్లోబల్ సిటీగా మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయని అధికారులు వెల్లడించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు