Homeఆంధ్ర ప్రదేశ్కొత్త ఓటు బ్యాంక్‌పై ప‌వ‌న్ ఫోక‌స్‌....!

కొత్త ఓటు బ్యాంక్‌పై ప‌వ‌న్ ఫోక‌స్‌….!

విజయవాడ, క్రైమ్ మిర్ర‌ర్‌: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆలోచన అంతా కొత్త ఓటు బ్యాంకుపైనే ఉంది. యువ ఓటర్లపైనే ఆయన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కొత్తతరం ఓటర్లు లక్షల సంఖ్యలో వస్తారు. వారే ఎన్నికల్లో విజయానికి కీలకంగా మారనున్నారు. గెలుపులో యువత కీలక భూమిక పోషిస్తుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే తనకు కులాలు అంటగట్టవద్దని పదే పదే కోరుతున్నారు. తనను ఒక కులానికే ముద్ర వేసి చూడవద్దని, అందరూ ఓట్లు వేస్తేనే తాను గెలిచానని పవన్ కల్యాణ్ పదే పదే గుర్తు చేస్తున్నారు. దీని వెనక పవన్ ఆలోచన రాబోయే యువతరం ఓట్లను ఆకట్టుకునేందుకేనన్నది ఆయన నయా స్ట్రాటజీగా తెలుస్తుంది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబును పక్కన పెడితే .. టీడీపీలో లోకేశ్, వైసీపీలో జగన్, జనసేనలో పవన్ అందరూ చిన్న వయసు వాళ్లే.

Also Read:“8 ఏళ్ల కొడుకు ముందే తండ్రి ఘోర నిర్ణయం… సెల్ఫీ వీడియోలో షాకింగ్ ఆరోపణలు!

అందరికంటే లోకేశ్ వయసులో చిన్న అయినప్పటికీ రాజకీయాల్లోకి వచ్చేసరికి మిగిలిన ఇద్దరూ కూడా యూత్ లీడర్ల కిందే లెక్క. అయితే ఈ ముగ్గురిలో యూత్ తనకు కనెక్ట్ అవ్వాలన్నది జనసేనాని ఆలోచనగా ఉంది. పవన్ కల్యాణ్ పై అవినీతి ముద్ర లేదు. మాట మీద నిలబడి ఉండరన్న పేరు తప్ప.. పవన్ కల్యాణ్ పై రెటువంటి చెడు అభిప్రాయం లేదు. మరొకవైపు పవన్ కల్యాణ్ ప్రజా సంక్షేమం కోసమే నిరంతరం పనిచేస్తారని, రాజకీయాల కంటే ఎక్కువగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెడతారన్న పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయంలో పవన్ కల్యాణ్ ఉన్నారు.ఇప్పటికే ఓటర్ల సమగ్ర సవరణ ప్రారంభం కానుంది. చాలా వరకూ ఓట్లు పోతాయి. 2029 ఎన్నికల్లో కొత్త ఓటర్లు వచ్చి చేరతారు.

Also Read:“ముంబై ఖర్చులు భరించలేను…” – వరవరరావు విజ్ఞప్తిపై హైకోర్టు కీలక నిర్ణయం?

వారిని టార్గెట్ చేసుకుని తాను ముందుకు వెళితే గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయని పవన్ కల్యాణ్ అంచనా వేస్తున్నారు. తమిళనాడులో విజయ్ కు యువత, మహిళలు ఎక్కువగా కనెక్ట్ కావడంతోనే పార్టీ పెట్టిన ఏడాదిన్నరకే అధికారంలోకి వచ్చారు. అలాంటిది ప్రయత్నిస్తే తాను ఎందుకు కాలేనన్న నమ్మకంతో పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకే ఆయన సొంత సామాజికవర్గాన్ని కూడా దూరం చేసుకునేందుకు సిద్ధమయ్యారన్న టాక్ జనసేన వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ యువతను ఎంత మేరకు ఆకట్టుకుంటారన్నది భవిష్యత్ లో తేలనున్నప్పటికీ ఆయన ఆలోచన మాత్రం విభిన్నంగా సాగుతుందనే చెప్పాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు