HomeజాతీయంGSLV-F17 Mission: ఇస్రో కీలక ప్రయోగం.. లాంచింగ్ కు రెడీ అయిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్17

GSLV-F17 Mission: ఇస్రో కీలక ప్రయోగం.. లాంచింగ్ కు రెడీ అయిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్17

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌17 రాకెట్‌ ద్వారా ఈవోఎస్‌-05 అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహం బరువు సుమారు 1,117 కిలోలు ఉండనుంది.

చివరి దశకు చేరిన ప్రయోగ పనులు

ఈ ప్రయోగాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాకెట్‌కు సంబంధించిన తుది సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. రాకెట్‌ అనుసంధాన శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తి సమాచారం అందించారు. ఇప్పుడు అన్ని వ్యాధులను మరోసారి జాగ్రత్తగా పరిశీలించారు.

రెండు ఫెయిల్యూర్స్ తర్వాత మరో ప్రయోగం

గత కొంతకాలంగా ఇస్రోకు కొన్ని ప్రయోగాల్లో ఎదురైన ఇబ్బందుల తర్వాత ఈ ప్రయోగం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాది మే 18న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ61, అలాగే ఈ ఏడాది జనవరి 12న పంపిన పీఎస్‌ఎల్వీ-సీ62 మిషన్లు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ కారణంగా శాస్త్రవేత్తలు అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షించి, సాంకేతిక లోపాలు మళ్లీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగంపై శాస్త్రవేత్తల ప్రత్యేక దృష్టి. రాకెట్‌లోని ప్రతి దశ పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ప్రయోగ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక సాంకేతిక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి.

భూ పరిశీలను మరింత ఉపయోగం

ఈవోఎస్-05 ఉపగ్రహం భూ పరిశీలనకు ఉపయోగపడనుంది. వ్యవసాయం, వాతావరణ పరిస్థితులు, ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ, భద్రతా అవసరాలకు అవసరమైన వాటిని అందించడంలో ఈ ఉపగ్రహ పాత్రను పోషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇస్రో చేపట్టనున్న ఈ ప్రయోగం విజయవంతమైతే, భారత అంతరిక్ష రంగానికి మరో కీలక ముందడుగు కానుంది. ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెరుగుతున్న సమయంలో ఈ ప్రయోగం శాస్త్రవేత్తలకు ఎంతో కీలకంగా మారింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు