Homeక్రైమ్సిద్దిపేట‌లో ఘోర విషాదం....! బావిలో కారుప‌డి న‌లుగురు మృతి...

సిద్దిపేట‌లో ఘోర విషాదం….! బావిలో కారుప‌డి న‌లుగురు మృతి…

సిద్దిపేట, క్రైమ్ మిర్రర్: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఓపెన్ బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో డి. రాజు (30), ఆయన భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరు సిద్దిపేట జిల్లాలోని బల్వంత్‌పూర్ గ్రామానికి చెందినవారు.

బంధువు కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం…

Also Read:రూ.1.5 కోట్ల ‘బాస్ స్కామ్’ వెనుక అంతర్జాతీయ సైబర్ ముఠా.. 4,500 సిమ్ కార్డులు స్వాధీనం

రాజు కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధిపేటకు వెళ్లారు. బంధువు మృతి అనంతరం నిర్వహించే దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని బుధవారం అర్ధరాత్రి సమయంలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. అప్పన్నపల్లి సమీపానికి చేరుకున్న తర్వాత కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఓపెన్ బావిలోకి దూసుకెళ్లింది.

స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం…

Also Read:విమల్‌ యాడ్‌ ఎఫెక్ట్‌.. బాలీవుడ్‌ హీరోలకు భారీ జరిమానా తప్పదా?

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో కారును బావి నుంచి బయటకు తీసి, మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మృతి చెందడంతో బల్వంత్‌పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు