Homeక్రైమ్మైలార్‌దేవ్‌ప‌ల్లిలో హృద‌య విదార‌క ఘ‌ట‌న‌...!పార్కులో ప‌సికందు మృత‌దేహం...

మైలార్‌దేవ్‌ప‌ల్లిలో హృద‌య విదార‌క ఘ‌ట‌న‌…!పార్కులో ప‌సికందు మృత‌దేహం…

రంగారెడ్డి, క్రైమ్‌మిర్ర‌ర్‌: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ని పార్కులో ప‌సికందు మృత‌దేహం క‌నిపించ‌డంతో ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. బుధవారం ఉదయం స్థానిక పార్కులో సుమారు ఐదు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పార్కు వద్దకు చేరుకుని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read:కేంద్ర‌ప్ర‌భుత్వం కీల‌క అడుగు….!బుల్లెట్ ట్రైన్ సర్వే షురూ…

దీనిపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ మృతదేహాన్ని గుర్తు తెలియని మహిళ పార్కులో వదిలి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని చూసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read:వార‌ణాసిలో మాంసం బంద్‌…!ఇక శాఖాహార‌మే…?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు