HomeతెలంగాణDiet Tips: జలుబు, దగ్గు రాకుండా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే..!

Diet Tips: జలుబు, దగ్గు రాకుండా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే..!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: జూన్, జూలై నెలలో మే నెలతో కంపేర్ చేస్తే.. ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాతావరణంలో మార్పులు, తేమ పెరగడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వేడి ఆహారం…

వర్షాకాలంలో తాజాగా వండిన వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఎక్కువసేపు నిల్వ చేసిన లేదా చల్లారిన ఆహారం ఫుడ్‌బోర్న్ ఇన్‌ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంది. వేడి ఆహారం జీర్ణం కావడానికి సులభంగా ఉండటమే కాకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

అల్లం – పసుపు…

అల్లం, వెల్లుల్లి, పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో కీలకంగా పనిచేస్తాయి.

విటమిన్-సి పండ్లు …

ఉసిరికాయ, జామ, నారింజ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక కణాల పనితీరును బలోపేతం చేసి శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడతాయి.

సూప్‌లు, రసం…

వర్షాకాలంలో వేడి వేడి సూప్‌లు, రసం, హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందుతుంది. గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ప్రోటీన్ ఫుడ్స్…

పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు యాంటీబాడీల ఉత్పత్తికి సహాయపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

పెరుగు, మజ్జిగ…

తాజా పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గట్ హెల్త్ బాగుంటే ఇమ్యూనిటీ కూడా మెరుగ్గా పనిచేస్తుంది.

ఏం తినకూడదు…

అధికంగా వేయించిన పదార్థాలు, చక్కెర పానీయాలు, పరిశుభ్రత లేని స్ట్రీట్ ఫుడ్, సరిగా కడగని పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వీటిని వీలైనంత వరకు నివారించాలి.

నీరు తప్పనిసరి…

వర్షాకాలంలో దాహం తక్కువగా అనిపించినా శరీరానికి అవసరమైనంత నీరు తాగాలి. సరైన హైడ్రేషన్ రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పోషకాహారం, తగినంత నిద్ర, వ్యాయామం, పరిశుభ్రతతో పాటు సరైన డైట్ పాటిస్తే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు